ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 3 తెలంగాణ సైన్యం డిజిటల్ న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రెడ్డి సంఘ అభ్యున్నతికై పాటుపడాలని రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ రెడ్డి అన్నారు.ఎల్లారెడ్డిపేట రెడ్డి సంఘం మండల అధ్యక్షులుగా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త కుంభాల సుధాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రమాణ స్వీకారానికి ముందు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు చర్చ మండలి నుండి సాయి మణికంఠ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రమాణ స్వీకారం రెడ్డి సంఘం మండల నాయకులు నాయకులు గుర్రాల రాజిరెడ్డి, నాయన భాస్కర్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి నూతన అధ్యక్షులు కుంబాల సుధాకర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలో రెడ్డి సంఘ అభ్యున్నతికై శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.రెడ్డి సంఘంలో నిరుపేద లు ఎవరైనా ఉంటే వారికి తన శాయశక్తుల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో విద్య, వైద్యపరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. రెడ్డి సంఘ కుల బాంధవులు ఎవరైనా హైదరాబాదులోని రెడ్డి సంఘ హాస్టల్ లో చదువుకోవాలనుకుంటే వారికి ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తానని సుధాకర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి జాగృతి అధ్యక్షులు బుట్టంగారి మాధవరెడ్డి, ఈడబ్ల్యూఎస్ జాతీయ అధ్యక్షులు పెంజర్ల మహేందర్ రెడ్డి, రాష్ట్ర రెడ్డి సంఘం ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి,రెడ్డి సంఘాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి,కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కలిమెల రాజకుమార్ రెడ్డి,జిల్లా రెడ్డి సంఘం నాయకులు పూర్మాని రాం లింగారెడ్డి,రెడ్డి సంఘ మాజీ మండలాధ్యక్షులు గన్న మల్లారెడ్డి,జంగ అంజిరెడ్డి,గుండాడి వెంకట్ రెడ్డి, నేవూరి వెంకట్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, కొండాపురం వెంకట్ రెడ్డి, లతో పాటు వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో రెడ్డి కులభాందవులు పాల్గొన్నారు.

Leave a Reply